జీవో 46 అభ్యర్థులకు న్యాయం చేయాలి
లేకపోతే ఆందోళన చేస్తామన్న కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చిన సర్కార్ ప్రజలను మోసం చేసిందని అన్నారు. ప్రధానంగా 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాని చెప్పి మాట మార్చిందన్నారు. విడుదల చేసిన జాబ్ క్యాలండెర్ బక్వాస్ అంటూ కొట్టి పారేశారు.
ఇదే సమయంలో తనను కలిసిన నిరుద్యోగ అభ్యర్థులకు భరోసా ఇచ్చారు కేటీఆర్. జీవో 46 అభ్యర్థులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి.. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వెంటనే వారికి న్యాయం చేయాలని కోరారు.
ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించారు నిరుద్యోగ అభ్యర్థులు. తమ న్యాయ పరమైన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ ను కోరారు. తమతో ఓట్లు వేయించుకుని తర్వాత మోసం చేసిందని వాపోయారు.
ఇదిలా ఉండగా ఇదే 46 జీవోకు సంబంధించి సీఎస్ శాంతి కుమారితో తాను మాట్లాడటం జరిగిందని చెప్పారు కేటీఆర్.