జెండా పండుగను ఘనంగా నిర్వహించాలి
పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరు జిల్లా – రాబోయే పంధ్రాగస్టును పురస్కరించుకుని ప్రతి ఒక్కరు జెండా పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. శనివారం ఆయన గుంటూరు జిల్లాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆగస్టు 15న దేశంలో ప్రతి భారతీయుడు జెండా ఎగుర వేయాలని అన్నారు, ప్రధాని మోడీ పిలుపు మేరకు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.. ప్రతి పోస్ట్ ఆఫీసులో మువ్వన్నెల జెండాలను తక్కువ ధరకు అందుబాటులో ఉంచామని చెప్పారు కేంద్ర మంత్రి.
సోషల్ మీడియాలో సైతం మువ్వన్నెల జెండా పెట్టాలని కోరారు, ఇళ్లపై కూడా జాతీయ జెండాలు ఎగుర వేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పారు. గ్రామ పంచాయతీలకు పంధ్రాగస్టు నిర్వహణ కోసం రూ. 25 వేల రూపాయలు ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయా పల్లెల్లో పండుగ వాతావరణం కళ కళ లాడాలని సూచించారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.