ప్రభుత్వ నిర్ణయం పంచాయతీల బలోపేతం
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. శనివారం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
కీలకమైన గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలని తాము కంకణం కట్టుకున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం. ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు .
పలుమార్లు అధికారులతో సమీక్షల తర్వాత కీలకంగా మూడు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు పవన్ కళ్యాణ్. గ్రామ సభల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ నిధుల వ్యయంపై పల్స్ సర్వే, స్వాత్రంత్ర, గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంపుపై ఫోకస్ పెట్టామన్నారు.
ఇదిలా ఉండగా 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ. 10,000 , 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పల్లెలకు రూ. 25,000 ఇస్తున్నామని ప్రకటించారు డిప్యూటీ సీఎం.