గూగుల్ ను సందర్శించిన రేవంత్ రెడ్డి
కీలక అంశాలపై ప్రతినిధులతో చర్చలు
అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా శనివారం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కార్యాలయాన్ని సందర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. గూగుల్ ఇప్పుటు సెర్చ్ ఇంజన్ లో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.
గూగుల్ ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉంది. ఈ సందర్బంగా గూగుల్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ అంటేనే హైటెక్ సిటీ అన్న పేరు ఇప్పటికే ఉందని , తాము వచ్చాక ఫ్యూచర్ సిటీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి వివరించారు.
టెక్నాలజీ పరంగా ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని గూగుల్ ప్రతినిధులను కోరారు. ఇప్పటికే గూగుల్ పలు సేవలపై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉండగా తన జీవితంలో మరిచి పోలేని రోజుగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి గూగుల్ ను సందర్శించడం.