రేవంత్ రెడ్డితో రామ్ చరణ్ భేటీ
కలవడం ఆనందంగా ఉందన్న సీఎం
అమెరికా – అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. ఇదిలా ఉండగా కాలిఫోర్నియాలోని బే ఏరియాలో బిజినెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్బంగా ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ , రచయిత, వక్త, ప్రొఫెసర్ అయిన రామ్ చరణ్ కలిశారు.
ప్రపంచ వ్యాపార ఆలోచనలు, ధోరణులను రూపొందించడంలో అనేక అగ్రశ్రేణి కంపెనీలు, సీఈవోలు, బోర్డులతో కలిసి 40 ఏళ్లకు పైగా ప్రొఫెసర్ రామ్ చరణ్ పని చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు.
అమెరికాలో కీలకమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా టయోటా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, కీ బ్యాంక్, నోవార్టిస్, యిల్డిజ్ హోల్డింగ్స్, యుఎస్టీ గ్లోబల్, ఫాస్ట్ రిటైలింగ్ (Uniqlo), మ్యాట్రిక్స్‌తో సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలకు రామ్ చరణ్ మెంటార్ గా ఉన్నారు.
ఆచరణాత్మక అనుభవంతో, సంక్లిష్టతను తగ్గించడంలో ప్రసిద్ధి చెందారు ప్రొఫెసర్ రామ్ చరణ్. ప్రధాన వ్యాపార సమస్యలను వెలికి తీసేందుకు వేగంగా మారుతున్న వాతావరణంలో వ్యాపారం, ఆలోచించి అమలు చేయడానికి కీలక సూచనలు అందజేశారు.
సిఇఓలుగా కొనసాగిన డజనుకు పైగా నాయకులకు శిక్షణనిచ్చి, 30కి పైగా పుస్తకాలను రచించిన రామ్ చరణ్‌ను హైదరాబాద్ ను సందర్శించాలని కోరారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.