అమెజాన్ ను సందర్శించిన సీఎం
కెర్రీ పర్సన్ తో విస్తృతంగా చర్చలు
అమెరికా – యుఎస్ఏ టూర్ లో బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ప్రముఖ దిగ్గజ లాజిస్టిక్ కంపెనీ అమెజాన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా అమెజాన్ సీనియర్ ప్రతినిధి కెర్రీ పర్సన్, ఇతర ప్రతినిధులతో ముచ్చటించారు సీఎం.
అమెజాన్ ఇంక్ ఇప్పటికే హైదరాబాద్ పై ఫోకస్ పెట్టిందని తెలిపారు. వర్క్ ఫోర్స్ ను గణనీయంగా విస్తరించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు కెర్రీ పర్సన్. వీపీ, ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ , డెలివరీ కూడా చేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాలను పెంచడానికి బలమైన నిబద్ధతను పొందిందన్నారు. రాష్ట్రంలో అమెజాన్ ను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా 2023లో అమెజాన్ ఎయిర్ కార్పొరేట్ ఆఫీసును భారీ ఎత్తున ఏర్పాటు చేసింది హైదరాబాద్ లో. ఇందులో భాగంగా మూడు కార్యాచరణ డేటా సెంటర్లుగా గుర్తించింది అమెజాన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పై ఎక్కువగా అమెజాన్ దృష్టి సారించింది.