కొట్టుకు పోయిన తుంగభద్ర డ్యామ్ గేట్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
కర్నూలు జిల్లా – ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ కర్నూలు జిల్లాలోని నాలుగు మండలాల ప్రజలను హెచ్చరించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి భారీ ఎత్తున నీరు వస్తోందని తెలిపారు. దీంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది.
వరద ఉధృతి దెబ్బకు తుంగభద్ర డ్యామ్ వద్ద కనిపించకుండా పోయింది 19వ నెంబర్ గేట్. దీని కారణంగా ఉన్న చైన్ లింక్ తెగి పోయింది. వరద ధాటికి కొట్టుకు పోవడంతో నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఈ ఒక్క గేట్ నుంచి సుమారు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండడంతో మొత్తం 48 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఈ కారణంగా కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎండీ రోణంకి కూర్మనాథ్. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1070,112, 18004250101 సంప్రదించాలని కోరారు.
కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదని పేర్కొన్నారు.