NEWSANDHRA PRADESH

ఆగ‌స్టు 15 నుండి రెవిన్యూ స‌ద‌స్సులు

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి – ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ సంబంధిత స‌మ‌స్య‌ల‌పైనే ఎక్కువగా ఫిర్యాదులు వ‌స్తున్న‌ట్లు గుర్తించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈమేర‌కు ఆయ‌న ప్ర‌భుత్వ శాఖ‌ల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ప్ర‌ధానంగా రెవిన్యూ శాఖ‌కు సంబంధించి ఎక్కువ‌గా ఫిర్యాదులు రావ‌డాన్ని ప్రస్తావించారు. ప్ర‌త్యేకంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం దృష్టి సారించాలని ఆదేశించారు.

త‌న‌తో పాటు త‌న‌యుడు లోకేష్, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఇత‌ర మంత్రులు చేప‌ట్టిన ప్ర‌జా ద‌ర్బార్ ల‌లో బాధితులు భూముల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌నే 70 శాతానికి పైగా ఫిర్యాదు చేసిన‌ట్లు తేలింద‌న్నారు.

దీంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఆగ‌స్టు 15 నుండి 30వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌భుత్వ భూముల‌తో పాటు ప్ర‌జ‌ల‌కు చెందిన భూముల‌ను కూడా క‌బ్జా చేశార‌ని ఆరోపించారు.