లోకేష్ ఆదేశం కాంట్రాక్టు లెక్చరర్స్ సంతోషం
సేవలను పునరుద్దరించాలని మంత్రి ఆదేశం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కాంట్రాక్టు లెక్చరర్లకు. తమను కంటిన్యూ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రజా దర్బార్ లో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు విన్నవించారు ఒప్పంద అధ్యాపకులు.
ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు నారా లోకేష్. వెంటనే కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి రెన్యూవల్ చేయాలని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో 476 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,619 మంది ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీరి సేవలు పూర్తి కావడంతో తిరిగి పునరుద్దరించలేదు విద్యా శాఖ.
దీనిపై విషయం తెలుసుకున్న నారా లోకేష్ వెంటనే కాంట్రాక్టు లెక్చరర్లను కొనసాగించాలని ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు జీఓ నెంబర్ 328 ప్రకారం ఈ ఏడాది జూన్ 1నుంచి 2025 ఏప్రిల్ 30 వతేదీ వరకు 11 నెలలపాటు వీరి సేవలు కొనసాగనున్నాయి.
ఈ సందర్బంగా నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఏపీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్ చౌదరి.