హిండెన్‌బర్గ్ కామెంట్స్ సెబీ చైర్ పర్సన్ ఫైర్
తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణ
ముంబై – దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సెబీ చైర్ పర్సన్ మధాబి పూరీ బుచ్ చర్చనీయాంశంగా మారారు. తాజాగా హిండెన్‌బర్గ్ సంచలన నివేదిక వెల్లడించింది. గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలలో చైర్ పర్సన్ తో పాటు ఆమె భర్త కూడా పెద్ద ఎత్తున నిధులు పెట్టుబడిగా పెట్టారని బాంబు పేల్చింది.
దీనిపై ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అదానీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ తరుణంలో హిండెన్ బర్గ్ వెల్లడించిన రిపోర్ట్ పై ఆదివారం స్పందించారు సెబీ చైర్ పర్సన్.
తనకు ఆ నివేదికతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంది. అంతే కాదు ఎలాంటి వివరాలు కావాలన్నా ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు సెబీ చైర్ పర్సన్.
తన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించి అన్నింటిని బహిర్గతం చేసేందుకు రెడీగా ఉన్నానని పేర్కొంది. తమ జీవితం , ఆర్థిక విషయాలకు సంబంధించి తెరిచిన పుస్తకమని ఆమె పేర్కొనడం విశేషం.