రాష్ట్రంలో ఒక్కటైన హస్తం..కమలం
బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఆయన ఆదివారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.
ఏం తప్పు చేశారని కేటీఆర్ ను జైల్లో వేస్తారంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడటంపై మండిపడ్డారు. ఏం తప్పు చేశాడని ఇలాంటి కామెంట్స్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రావుల శ్రీధర్ రెడ్డి.
కేటీఆర్‌ను జైల్లో వేయక పోతే యుద్ధం చేస్తానని బండి అంటున్నారని, సీఎం, కేంద్ర మంత్రి తీసుకుంటారా అని నిలదీశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డి ముగ్గురూ కలిసి ఒక్కటయ్యారని ఆరోపించారు.
మసీదులు తవ్వుతానంటూ ఎంపీ అయ్యారని, జై శ్రీరామ్ పేరుతో కేంద్ర మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేశారో చర్చించేందుకు సిద్దంగా ఉన్నారని సవాల్ విసిరారు బండి సంజయ్ కి.
బండి, కిషన్ రెడ్డిలు కేంద్ర మంత్రులుగా ఉన్నా ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించ లేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.