రైతుల సాధికారత కోసం ప్రయత్నం
109 కొత్త రకపు విత్తనాలు విడుదల
న్యూఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, సాధికారత కోసం కట్టుబడి ఉందన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆదివారం ఆయన కీలక ప్రకటన ప్రకటన చేశారు. ఇందులో భాగంగా రైతు సోదర సోదరీమణులకు శుభ వార్త చెప్పారు.
ఢిల్లీలో 109 కొత్త పంటల రకాలను విడుద చేశారు. ఈ అవకాశం తనకు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి. వాతావరణానికి అనుకూలమైన, అధిక దిగుబడిని చ్చే మేలు రకాల వంగడాలను ఉపయోగించుకునే వీలు కలుగుతుందన్నారు.
దీని వల్ల ఉత్పత్తి గణనీయంగా పెరగడం, ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువ రావడం రైతులకు జరుగుతుందని చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
రైతులు గత కొంత కాలం నుంచి పాత కాలపు పద్దతుతలను, వంగడాలను వాడుతున్నారని తెలిపారు. దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానిని గమనించిన తమ ప్రభుత్వం మేలు రకాలైన విత్తనాలను తయారు చేయాలని సంకల్పించిందని తెలిపారు.
తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.