రాహుల్ గాంధీ విదేశీ పౌరుడు
బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణియన్ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడు, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన భారతీయ పౌరుడు కానే కాదని అన్నారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాహుల్ గాంధీ భారతీయ పౌరుడు కాదని, ఆయన విదేశీ పౌరుడంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు సుబ్రమణియన్ స్వామి. ఆయన పక్కా బ్రిటీష్ కు చెందిన పౌరుడంటూ మండిపడ్డారు.
రాహుల్ గాంధీ “బ్రిటీష్ ప్రభుత్వానికి దాఖలు చేసిన వార్షిక రిటర్న్” అని ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఒక పత్రాన్ని పంచుకోవడం ద్వారా ఆయన ఈ ప్రకటన చేశారు.
ద్వంద్వ పౌరసత్వం కలిగిన వ్యక్తి నిర్వహించే పార్లమెంటరీ పదవికి చట్టబద్ధతపై ఇది ఆందోళనలను లేవనెత్తింది. ఒక వ్యక్తికి రెండు పౌర సత్వాలు ఎలా ఉంటయాని ప్రశ్నించారు సుబ్రమణియన్ స్వామి. రాహుల్ గాంధీని కావాలని ప్రధాన మంత్రి మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా రక్షిస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోక పోతే తాను కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు బీజేపీ నేత.