మోహన్ బాబుపై భట్టి ప్రశంసల జల్లు
ఆయన జీవితమే ఓ యూనివర్శిటీ
తిరుపతి – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు, శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మోహన్ బాబును ఆకాశానికి ఎత్తేశారు. ప్రశంసల జల్లు కురిపించారు.
అంతకు ముందు మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. అక్కడ అధికారికంగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆదివారం తిరుపతిలోని శ్రీ విద్యానికేతర్ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా మల్లు భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించారు మా చైర్మన్ , మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు. ఇవాళ ఇక్కడికి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
తనకు ఎప్పటి నుంచో స్నేహితుడిగా ఉన్నాడని అన్నారు . మోహన్ బాబు తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడని కొనియాడారు. ఆయన జీవితమే ఓ యూనివర్శిటీ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.
విద్యా సంస్థలను వ్యాపరంగా చూడకుండా 25 శాతం పేద విద్యార్థులకు సీట్లను కేటాయించడం మామూలు విషయం కాదన్నారు.