పాకిస్తాన్ కు సౌదీ అరేబియా వార్నింగ్
తమ దేశానికి యాచకులు పంపిస్తే ఖబడ్దార్
సౌదీ అరేబియా – తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. యాత్రికుల రూపంలో తమ దేశానికి యాచకులు వస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది సౌదీ అరేబియా. రూ. 5 లక్షలతో పాటు సౌదీ పాస్ పోర్టుతో పాకిస్తాన్ కు చెందిన ఓ యాచకుడు సౌదీ ఎయిర్ పోర్టులో పట్టుబడటం కలకలం రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సౌదీ అరేబియా రాజు .
యాత్రికులు తమ దేశానికి వస్తే అభ్యంతరం లేదని తెలిపారు. కానీ ఇదే సమయంలో యాత్రికుల ముసుగులో యాచకులు, జేబు దొంగలను పంప వద్దని కోరారు. ఈ విషయంలో ప్రస్తుతం వదిలి పెట్టామని ఇక ముందు ఇలా జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు సౌదీ ప్రిన్స్.
గల్ఫ్ దేశాలు పాకిస్థానీలను నియమించు కోవడం మానుకుంటున్నాయని, ఎందుకంటే వారు యాచకులు లేదా నేరస్థులుగా పేరు తెచ్చుకుంటున్నారని తమ విచారణలో తేలిందని పాకిస్తాన్ పేర్కొనడం విశేషం.
ఇదిలా ఉండగా సౌదీ అరేబియాలో భిక్షాటన చేస్తూ అరెస్టయిన వారిలో 90 శాతం మంది పాకిస్థానీలేనని సౌదీ అరేబియా సంచలన వివరాలు బయట పెట్టింది. దీనిని ఆధారంగా చేసుకుని ఇక నుంచి యాచకులు, నేర చరిత్ర కలిగిన వారిని పంపవద్దని హెచ్చరించారు ప్రిన్స్.