స‌చిన్ ఇచ్చిన ప్రోత్సాహం మ‌రిచి పోలేను

భార‌త క్రికెట‌ర్ షెఫాలీ వ‌ర్మ కీల‌క కామెంట్స్

ముంబై : ముంబై వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ ను భార‌త మ‌హిళా జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. విశ్వ విజేత‌గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 298 ర‌న్స్ చేసింది. అనంత‌రం ద‌క్షిణాఫ్రికా 246 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. సుదీర్ఘ కాలం త‌ర్వాత భార‌త్ జ‌గ‌జ్జేత‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో ఓపెన‌ర్లుగా మైదానంలోకి దిగారు భార‌త జ‌ట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధ‌న్నా, షెఫాలీ వ‌ర్మ‌. ఈ ఇద్ద‌రూ క‌లిసి సౌతాఫ్రికా ప్లేయ‌ర్ల భ‌ర‌తం ప‌ట్టారు. ఒక‌టో వికెట్ కు ఈ ఇద్ద‌రూ భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. 104 ర‌న్స్ జోడించారు. 45 ర‌న్స్ వ‌ద్ద భారీ షాట్ ఆడ‌బోయి అవుట్ అయ్యింది మంధన్నా. షెఫాలీ వ‌ర్మ 87 ర‌న్స్ చేసింది. 10 ఫోర్లు 2 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి.

ఆ త‌ర్వాత త‌ను ఊహించ‌ని రీతిలో బౌలింగ్ కూడా చేసింది. 2 వికెట్లు తీసింది. దీంతో భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించినందుకు త‌నకు ప్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు ద‌క్కింది. ఇక దీప్తి శ‌ర్మ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైంది. త‌ను ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో 5 వికెట్లు తీసింది. త‌ను టోర్నీలో ఏకంగా 22 వికెట్లు ప‌డ‌గొట్టింది. మ్యాచ్ అనంత‌రం , క‌ప్ తీసుకున్నాక షెఫాలీ వ‌ర్మ మీడియాతో మాట్లాడారు. భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డంలో భార‌త మాజీ కెప్టెన్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ పాత్ర ఎంతో ఉంద‌ని చెప్పింది. ఆయ‌న ఇచ్చిన సూచ‌న‌ల‌తోనే తాను బ్యాటింగ్ లో, బౌలింగ్ లో రాణించ‌డం జ‌రిగింద‌న్నారు. ఆయ‌న చేసిన మేలు మ‌రిచి పోలేనంటూ పేర్కొంది.

  • Related Posts

    బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *