DEVOTIONAL

టీటీడీ ప్రాణ‌దాన ట్ర‌స్ట్ కు రూ. 21 కోట్ల విరాళం

Share it with your family & friends

అంద‌జేసిన ట్రెడెంట్ గ్రూప్ సంస్థ చైర్మ‌న్

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా వినుతికెక్కిన తిరుమ‌ల‌లో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను కోట్లాది మంది భ‌క్తులు నిత్యం కొలుస్తుంటారు. త‌మ కోర్కెలు తీర్చే ఆ స్వామికి ముడుపులు చెల్లించ‌డం, విరాళాలు అందించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి విద్యా, వైద్య‌, అన్న‌దానం ట్ర‌స్టుల‌ను ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తోంది. అంతే కాకుండా స‌నాత‌న ధ‌ర్మం ప్రాశ‌స్త్యం గురించి ప్ర‌చారం చేస్తోంది. ఇదే స‌మ‌యంలో ఇరు తెలుగు రాష్ట్రాల‌లో ఆల‌యాల‌ను పున‌రుద్ద‌రించే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది.

ఇదిలా ఉండ‌గా భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి టీటీడీకి. తాజాగా పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన రాజిందర్ గుప్తా టీటీడీకి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21 కోట్లు విరాళంగా ఇచ్చారు.

ఆ మేరకు దాత చెక్కును టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి సి వెంకయ్య చౌదరికి తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలోఅందజేశారు. ఈ సంద‌ర్బంగా భారీ విరాళాన్ని అంద‌జేసినందుకు సంస్థ చైర్మ‌న్ కు, ప్ర‌తినిధుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు ఏఈవో.