NEWSINTERNATIONAL

షేక్ హ‌సీనాకు మ‌ద్ద‌తిస్తే జాగ్ర‌త్త

Share it with your family & friends

బంగ్లాదేశ్ తాత్కాలిక స‌ర్కార్ వార్నింగ్

బంగ్లాదేశ్ – దేశ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన షేక్ హ‌సీనాపై నిప్పులు చెరుగుతోంది తాత్కాలికంగా కొలువు తీరిన మ‌ధ్యంత‌ర యూన‌స్ ప్ర‌భుత్వం. ప్ర‌ధానంగా దేశంలోని మీడియా షేక్ హ‌సీనాకు మ‌ద్ద‌తుగా ఉంటోంద‌ని ఆరోపించింది. ఇది ఇలాగే కొన‌సాగిస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని మీడియాను హెచ్చ‌రించింది.

సౌమ్యుడైన నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్ ను తాత్కాలిక ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నుకుంటే దేశంలో లా అండ్ ఆర్డ‌ర్ స‌ద్దు మ‌ణుగుతుంద‌ని, ప‌రిస్థితులు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయ‌ని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆర్మీ చేతుల్లో ప్ర‌స్తుత స‌ర్కార్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ప్ర‌ధానంగా బంగ్లాదేశ్ మీడియాను హెచ్చ‌రించ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది. నిరసనల సందర్భంగా షేక్ హసీనా ప్రభుత్వానికి మీడియా మద్దతు ఇస్తోందని ఎన్నుకోని మధ్యంతర ప్రభుత్వం ఆరోపించింది.

ఇదిలా ఉండ‌గా తాత్కాలిక హోం మంత్రి హొస్సేన్ ప్ర‌త్యేకంగా బీబీసీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. స‌ద‌రు మీడియా త‌మ‌కు వ్య‌తిరేకంగా వార్త‌ల‌ను, క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తోంద‌ని ఆరోపించారు. ఇలాగే కొన‌సాగిస్తే నిషేధం విధించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.