NEWSTELANGANA

టెక్స్‌టైల్ పార్క్ లో కొరియా భారీగా పెట్టుబ‌డి

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

ద‌క్షిణ కొరియా – తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని బృందం బిజీ బిజీగా ఉంది. ఇప్ప‌టికే అమెరికా ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింది. ప్ర‌స్తుతం సీఎం టీమ్ దక్షిణ కొరియాలో కాలు మోపింది. ఈ సంద‌ర్బంగా ప‌లు కంపెనీల‌తో చ‌ర్చ‌లు ప్రారంభించారు సీఎం.

కొరియా ఫెడ‌రేష‌న్ ఆఫ్ టెక్స్ టైల్స్ ఇండ‌స్ట్రీ (కొఫోటీ) ఆధ్వ‌ర్యంలో బిజినెస్ రౌండ్ టేబుల్ నిర్వ‌హించారు. దేశంలో పేరు పొందిన కొరియ‌న్ వ‌స్త్ర రంగ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు ఇందులో పాల్గొన్నారు. సీఎంతో చ‌ర్చించారు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ కొన‌సాగుతోంది. కొరియన్ కంపెనీలు ఈ టెక్స్ టైల్స్ పార్కులో భారీగా పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి.

యంగ్ గోన్‌ ఛైర్మన్‌ మిస్టర్‌ కిహాక్‌ సంగ్‌, కొఫోటి (KOFOTI )ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ఛైర్మన్‌ సోయంగ్‌ జూ తో పాటు 25 ప్రధాన టెక్స్‌టైల్ కంపెనీలకు చెందిన ఇతర అగ్రశ్రేణి నాయకులు ఇందులో పాల్గొన్నారు.

టెక్స్‌టైల్ రంగంలో వరంగల్‌తో పాటు తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలకు మరిన్ని పెట్టుబడులు రానున్నాయ‌ని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.