కేరళ క్రికెట్ లీగ్ కు శాంసన్ ఐకాన్
లోగోను ఆవిష్కరించిన స్టార్ క్రికెటర్
కేరళ – కేరళ నుంచి గతంలో శ్రీశాంత్ పేరు వినిపించేది ఎక్కువగా. కానీ ఇప్పుడు ఒకే ఒక్కడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతడు ఎవరో కాదు స్టార్ క్రికెటర్ , రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్. వచ్చే ఐపీఎల్ కు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాడు. భారత జట్టులో అడపా దడపా ఎంపికవుతున్నా ఆశించిన మేర రాణించలేక పోవడం కొంచెం ఇబ్బందిగా మారింది.
మరో వైపు తను క్లోజ్ గా భావించే మెంటార్ కుమార సంగక్కర రాజస్థాన్ రాయల్స్ కోచ్ నుంచి తప్పుకోనుండడంతో మరికొంత ఇబ్బంది ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇక రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
ఇది పక్కన పెడితే ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ ఏర్పాటైంది. దీనికి సంబంధించిన లోగోను ఆవిష్కరించాడు సంజూ శాంసన్. తనే కేరళకు , ఈ లీగ్ కు ప్రస్తుతం ఐకాన్ గా ఉన్నాడు. ఈ లోగోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురంలో ఆవిష్కరించడం విశేషం.
ఈ కార్యక్రమంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వినోద్ ఎస్ కుమార్, అధ్యక్షుడు జయేష్ జార్జ్ పాల్గొన్నారు. గ్లోబల్ వేదికపై కేరళ క్రికెట్ ప్రతిభను ప్రదర్శించడానికి ఈ లీగ్ దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు సంజూ శాంసన్.
ఐపీఎల్ లో ఇక్కడి నుంచి ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను చూడాలని ఉందన్నాడు. టి20 ప్రపంచ కప్ లో పాల్గొనడం గర్వంగా ఉందన్నాడు.