NEWSNATIONAL

కార్య‌క‌ర్త‌ల బ‌ల‌గం ఆప్ కు బ‌లం

Share it with your family & friends

కేంద్రంపై యుద్దానికి సిద్దం

న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు ఢిల్లీలో. గ‌త కొన్నేళ్లుగా దేశ రాజ‌ధానిలో కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ కావాల‌ని నిర్వీర్యం చేయాల‌ని చూసింద‌ని ఆరోపించారు.

ఎలాగైనా స‌రే ఆప్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేసింద‌ని, కానీ ఏ ఒక్క నాయ‌కుడు కానీ, కార్య‌క‌ర్త కానీ వారి వైపు క‌న్నెత్తి చూడ‌లేద‌ని అన్నారు. ఇది త‌మ పార్టీకి ఉన్న నిజ‌మైన‌, నిబ‌ద్ద‌త క‌లిగిన కార్య‌క‌ర్త‌ల బ‌ల‌మ‌ని స్ప‌ష్టం చేశారు మ‌నీష్ సిసోడియా.

ఈ సంక్షోభ సమయంలో ఆప్ కుటుంబం మరింత బలపడిందని చెప్పారు. కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సంకల్పించారు. మా నాయకులు , కార్యకర్తలు అద్భుతమైన ఐక్యతను ప్రదర్శించార‌ని కొనియాడారు. వారి రుణం ఈ జ‌న్మ‌లో తీర్చుకోలేమ‌న్నారు.

ఈ సంక్షోభ సమయంలో కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అద్భుతంగా ప‌ని చేసింద‌న్నారు. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేద‌న్నారు. విద్య‌, వైద్యం, సేవ‌ల రంగాల‌కు ఆటంకం జ‌ర‌గ‌కుండా పాల‌న సాగింద‌న్నారు. మోడీ, అమిత్ షా కుట్ర‌లు ఇక్క‌డ ప‌ని చేయ‌మ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.