త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
ప్రకటించిన ఏపీ డీజీపీ తిరుమల రావు
అమరావతి – ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు సంచలన ప్రకటన చేశారు. ఆయన నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. ప్రధానంగా పోలీస్ రంగంలోకి రావాలని కలలు కంటున్న వారికి త్వరలోనే జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు.
‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు డీజీపీ. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు డీజీపీ ద్వారకా తిరుమల రావు.
ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోనే ఉందన్నారు. కొందరు వ్యక్తిగత పరమైన దాడులకు దిగడం తమ దృష్టికి వచ్చిందని, వాటిపై కూడా ఫోకస్ పెట్టామన్నారు డీజీపీ. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్స్ భర్తీకి సంబంధించి ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుడతామన్నారు తిరుమల రావు.