NEWSANDHRA PRADESH

ప్ర‌జా ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట – సీఎం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ప్ర‌జా ఆరోగ్యానికి ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం ఏపీ రాష్ట్రంలోని వెలగపూడి సచివాలయంలో సీఎం అధ్య‌క్ష‌త‌న వైద్య‌, ఆరోగ్య శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు. గ‌త ప్రభుత్వం ఈ శాఖ‌ను పూర్తిగా గాలికి వ‌దిలి వేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనారోగ్య శాఖ‌గా మార్చేశాడ‌ని మాజీ సీఎంపై మండిప‌డ్డారు . తిరిగి గాడిన పెట్టే బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు సీఎం.

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్​ సాధనలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు.. అమలు చేయాల్సిన కార్యక్రమాల గురించి చంద్ర‌బాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్యసేవ అమలులో లోపాలు ఉండొద్దని, ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజారోగ్య పరిరక్షణకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. వైద్యం విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, వైద్య సేవలను సక్రమంగా అందించాలని, మందులను అన్ని వేళలా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.