NEWSNATIONAL

ఆప్ కు ప్ర‌జా బ‌లం బీజేపీకి ధ‌న బలం

Share it with your family & friends

సీఎం భ‌గ‌వంత్ మాన్ షాకింగ్ కామెంట్స్
హ‌ర్యానా – పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. మోడీ, అమిత్ షా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ లేద‌న్నారు. వారి కోరిక ఒక్క‌టే ఆప్ ను నామ రూపాలు లేకుండా చేయాల‌ని, కానీ అది ఎన్న‌టికీ వ‌ర్క‌వుట్ కాద‌ని తెలుసుకుంటే మంచిద‌న్నారు.

త‌మ పార్టీకి చెందిన చీఫ్ , సీఎం కేజ్రీవాల్ ను, డిప్యూటీ సీఎం సిసోడియాను, మంత్రి జైన్ ను తీహార్ జైలులో వేశారని కానీ చివ‌ర‌కు న్యాయ‌మే గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు. ఆప్ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు సైనికులు లాంటి వార‌న్నారు. వారు ఎవ‌రికీ త‌ల వంచ‌రు..అమ్ముడు పోర‌ని చెప్పారు.

ఆప్ కు ప్ర‌జా బ‌లం ఉంద‌ని, బీజేపీ ధ‌న బ‌లం చూసుకుని రెచ్చి పోతోంద‌ని మండిప‌డ్డారు సీఎం భ‌గ‌వంత్ మాన్. సోమ‌వారం హ‌ర్యానా లోని సోనిప‌ట్ లో జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. దేశంలో మార్పు తీసుకు వ‌చ్చే స‌త్తా ఆప్ కు ఉంద‌న్నారు.

పంజాబ్‌లో త‌మ‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతోందన్నారు. పంజాబ్‌లో 44,250 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, దీనికి ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించ లేద‌న్నారు సీఎం.

గృహ విద్యుత్‌ను ఉచితంగా అందజేశామ‌ని చెప్పారు. మత రాజకీయాలు ఎలా చేయాలో మాకు తెలియదని, కేవ‌లం. ప్రజల ప్రయోజనాల కోసం ఎలా పని చేయాలో మాత్ర‌మే తెలుస‌న్నారు భ‌గ‌వంత్ మాన్.