NEWSANDHRA PRADESH

వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలు

Share it with your family & friends

మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

అమ‌రావ‌తి – గ‌త వైసీపీ పాల‌న‌లో ఏపీ లోని అన్ని వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ నాశ‌నం అయ్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ డోలా శ్రీ బాల వీరాంజ‌నేయ స్వామి. ప్ర‌ధానంగా నిర్మాణ రంగం అస్త‌వ్య‌స్తంగా త‌యారైంద‌ని మండిప‌డ్డారు.

జగన్ మోహ‌న్ రెడ్డి ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని వాపోయారు . సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామంలో వడ్డెర ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను సైతం దారి మళ్లించిన ఘనుడు జగన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు.

తాము అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచిత ఇసుక పాలసీ తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు డోలా శ్రీ బాల వీరాంజ‌నేయ స్వామి. పేదల ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు .టిడిపి హయాంలో భవన నిర్మాణ కార్మికులకు అందించిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామ‌న్నారు మంత్రి.

కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య, కొండపి నియోజకవర్గ టిడిపి నేతలు, పలువురు వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు