సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్
కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ – భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఖుష్ కబర్ చెప్పింది. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది తమ తమ గమ్య స్థానాలకు రైల్వేలలో ప్రయాణం చేస్తుంటారు. వీరిలో ఎక్కువగా సీనియర్ సిటిజన్లు, చంటి పిల్లల తల్లులు, వికలాంగులు ఉండడంతో సీట్లకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే టికెట్ల కేటాయింపులో కొంత కన్సెషన్ గతంలో ఉండేది..కానీ మోడీ ప్రభుత్వం దానిని తీసి వేసింది. ఇక సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ప్రయాణీకులు వాపోతున్నారు. ఈ తరుణంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఎట్టకేలకు స్పందించింది రైల్వే శాఖ.
లోయర్ బెర్త్ లకు భారీ డిమాండ్ ఉండడంతో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలకు లోయర్ , సైడ్ లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేస్తామని ప్రకటించింది.
స్లీపర్ క్లాస్‌లలో 6 నుండి 7 లోయర్ బెర్త్‌లు, 3-టైర్ ఎసి కోచ్‌లలో 4 నుండి 5 లోయర్ బెర్త్‌లు , 2-టైర్ ఎసి కోచ్‌లలో 3 నుండి 4 లోయర్ బెర్త్‌లు సీనియర్ సిటిజన్‌లకు రిజర్వ్ చేయనున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరాక రైల్వే శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో రైల్వే శాఖ పాలనా పరంగా గాడి తప్పిందని, కేంద్రం కావాలని దానిని పట్టించు కోవడం లేదని విపక్షాలు పేర్కొంటున్నాయి.
గత 10 ఏళ్లుగా వ్యాపారవేత్తలకు ద్వారాలు తెరిచేందుకు ప్లాన్ చేస్తోందని, ప్రధానంగా అదానీకి అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మోడీపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.