మోడీ ఆందోళన యూనస్ క్షమాపణ
షేక్ హసీనా ప్రభావం ఉండబోదు
బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ దేశంలో హిందువులు, మైనార్టీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆయన మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. మత ఛాందసవాదులు కావాలని తమ దేశానికి చెందిన వారిపై దాడులకు పాల్పడడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి.
దీనిపై వెంటనే స్పందించింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. ఈ మేరకు ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు, మైనార్టీలపై దాడులు జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో మాజీ ప్రధాన మంత్రి షేక్ హాసీనా భారత దేశంలో ఉండడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు యూనస్. భారత్ తో తమ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూప బోదన్నారు.
ఇక నుంచి రక్షణ కల్పిస్తామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు యూనస్. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ పై నిషేధం విధించబోమంటూ హామీ ఇచ్చారు మోడీకి.