ఏఐసీసీ కీలక సమావేశం
మారనున్న పీసీసీ చీఫ్ లు
ఢిల్లీ – అఖిల భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) కీలక సమావేశం జరగనుంది న్యూఢిల్లీలో. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణు గోపాల్ , ప్రియాంక గాంధీతో పాటు కీలక నాయకులు హాజరు కానున్నారు.
వీరితో పాటు దేశంలోని ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు , ఆయా రాష్ట్రాల ఇంఛార్జ్ లు పాల్గొంటారు. ఇదిలా ఉండగా ఈ కీలక సమావేశంలో ప్రధానంగా ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి పీసీసీ అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ను కూడా మార్చనున్నారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ తో పాటు సీఎంగా ఉన్నారు ఎ. రేవంత్ రెడ్డి. ఆయనను తప్పించి ఎవరిని నియమిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ కీలక సమావేశంలో యువ నేతలకు జాతీయ స్థాయిలో పదవులు కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.