NEWSTELANGANA

కార్మికుల పీఎఫ్..ఈఎస్ఐ డ‌బ్బులు ఎక్క‌డ‌..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కాగ‌జ్ న‌గ‌ర్ మున్సిప‌ల్ కార్యాల‌యంలో ప‌ని చేస్తున్న కార్మికుల ధ‌ర్నాకు మ‌ద్ద‌తు ప‌లికారు.

వారికి సంబంధించిన పీఎఫ్, ఈఎస్ఐ డ‌బ్బులు ఎలా మాయ‌మ‌వుతాయ‌ని ప్ర‌శ్నించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఇది ప్ర‌జా ప్ర‌భుత్వ‌మా..లేక కార్మికులను దోచుకునే స‌ర్కారా అని నిల‌దీశారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పురపాలక సంస్థలో గత 5 సంవత్సరాలుగా పీఎఫ్ , ఈఎస్ఐ పేరుతో తీసుకున్న పి.ఎఫ్ డబ్బులు చెల్లించాలని కోరుతూ కార్మికులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా జిల్లాలో ప‌ర్య‌టించిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ వారికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

కార్మికుల వేతనాల నుండి పీ.ఎఫ్, ఈ.ఎస్.ఐ కట్ చేసిన పైసల్ ఎక్క‌డికి పోయాయంటూ నిల‌దీశారు. పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలను ఎందుకు ఇవ్వలేక పోతున్నరని మండిప‌డ్డారు. మీ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలకు మంత్రులకు, ఉన్నతాధికారులకు ఒకటో తారీఖుననే జీతాలెట్ల ఇస్తున్నారంటూ సీరియ‌స్ అయ్యారు ఆర్ఎస్పీ.

నిరుపేద కార్మికుల డబ్బును మింగిన అవినీతి పరులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.