NEWSANDHRA PRADESH

అసైన్డ్ భూములు చౌక‌గా క‌ట్టేశారు

Share it with your family & friends

ఏపీ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్

అమ‌రావ‌తి – గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఒరిజనల్ అసైనీలకు లబ్ది చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్లను మూడు నెలల పాటు నిలిపి వేయ‌డం జ‌రిగింద‌న్నారు. వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని ఆరోపించారు అన‌గాని స‌త్య ప్ర‌సాద్.

అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకొని వైసీపీ నేతలు ఒరిజనల్ అసైనీల నుండి అతి తక్కువ ధరలకే భూములను కొనుగోలు చేశార‌ని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారంటూ మండిప‌డ్డారు మంత్రి.

కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుండి ఫ్రీ హోల్డ్ చేశారని పేర్కొన్నారు. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను కూడా కొట్టేశారంటూ వాపోయారు. ప్ర‌భుత్వ ఆదాయానికి గండి కొట్టారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు అన‌గాని స‌త్య ప్ర‌సాద్.