ఆట పైనే ఫోకస్ సెలక్షన్ పై కాదు
స్పష్టం చేసిన క్రికెటర్ సంజూ శాంసన్
కేరళ – ప్రముఖ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఫోకస్ అంతా ఆట పైనే ఉంటుందని స్పష్టం చేశారు. తనను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందా లేక చేయదా అని తాను పట్టించు కోనంటూ పేర్కొన్నారు. వేరే అంశాల గురించి కూడా పట్టించు కోనంటూ చెప్పాడు సంజూ శాంసన్.
ప్రతి ఆటగాడికి ఓ రోజంటూ వస్తుందని, ఆ సమయంలో తప్పకుండా సక్సెస్ అవుతామన్న నమ్మకం ప్రతి ప్లేయర్ లోనూ ఉంటుందన్నాడు. మరింత మెరుగ్గా ఎలా ఆడాలనే దానిపైనే తాను దృష్టి పెడతానని తెలిపాడు.
ప్రస్తుతం తన కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టానని, మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు సంజూ శాంసన్. ఇదే సమయంలో భారీ విపత్తు సంభవించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. వారికి తన వంతుగా సాయం చేస్తానని తెలిపాడు.
వయనాడులో కొండ చరియలు విరిగి పడి 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దేశ వ్యాప్తంగా బాధకు గురి చేసింది. తాజాగా సంజూ శాంసన్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.