ఏసీబీకి చిక్కిన జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి
రూ. 8,00,000 లంచం తీసుకున్న వైనం
రంగారెడ్డి జిల్లా – తెలంగాణలో అవినీతి తిమింగలాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన , జవాబుదారీగా ఉండాల్సిన జాయింట్ కలెక్టర్ ఏకంగా అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికాడు.
మనోడు ఎవరో కాదు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ గా ఉన్న ఎంవీ భూపాల్ రెడ్డి. సీఎం రెడ్డి కావడంతో తనకు ఎదురే లేదని అనుకున్నాడో ఏమో సీనియర్ అసిస్టెంట్ వై. మదన్ మోహన్ రెడ్డితో కలిసి ఏకంగా రూ. 8,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
ధరణి పోర్టల్ లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు ఫిర్యాదుదారుడి నుండి లంచం డిమాండ్ చేశాడు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. ఈ ఇద్దరిని ఏసీబీ ట్రాప్ చేసింది. జేసీ, సీనియర్ అసిస్టెంట్ లు డబ్బులు అందుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఏసీబీ బృందాలు చాక చక్యంగా వలపన్ని పట్టుకున్నారు.
వీరిని పట్టుకునేందుకు రాత్రంతా జాగరణ చేశారని ఏసీబీ చీఫ్ వెల్లడించారు. నగర శివారులలో డబ్బులు తీసుకున్నా జేసీని ట్రాప్ చేసి పట్టుకుని, అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.