NEWSANDHRA PRADESH

సెబీ స్కామ్ పై జేపీసీ వేయాలి

Share it with your family & friends

మాజీ మంత్రి చింతా మోహ‌న్

రాజ‌మండ్రి – కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ నిప్పులు చెరిగారు. సెబీ స్కామ్ పై జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం రాజ‌మండ్రిలో చింతా మోహ‌న్ మీడియాతో మాట్లాడారు. రిజ‌ర్వేష‌న్లు ఎత్తి వేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర ప‌న్నుతున్నాయంటూ ఆరోపించారు.

పీవీ హ‌యాంలో ఇలాగే ఆరోప‌ణ‌లు వ‌స్తే జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ వేశార‌ని గుర్తు చేశారు. అదానీ కంపెనీల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఎందుకు మౌనంగా ఉంద‌ని ప్ర‌శ్నించారు చింతా మోహ‌న్.

జ‌గ‌న్ ప‌రిపాల‌న కంటే చంద్ర‌బాబు పాల‌న జ‌బ‌ర్ద‌స్త్ గా ఉంద‌న్నారు. తాను టీడీపీ చీఫ్ అయితే తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తిన‌ని కానీ అభినందిస్తే త‌ప్పేంటి అన్నారు. కాపు, బ‌లిజ‌లు ఏనాటికైనా రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు చింతా మోహ‌న్.

కాపు బలిజల్లో కసి, పట్టుదల ఉండాలని, అది ఉంటే ఏదో ఒక రోజు సీఎం కాక త‌ప్ప‌ద‌న్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ ఎస్సీల‌కు ప్రాధాన్య‌త ఇవ్వడం లేద‌ని ఆరోపించారు. జిల్లా కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఎస్సీ అధికారులను నియమించ‌క పోవ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు.

వెనుకబడిన వర్గాలు దేశంలో 60 కోట్ల మంది ఉంటే, ముగ్గురే సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నారని అన్నారు. 20 కోట్ల మంది మైనార్టీలు ఉంటే సుప్రీం జడ్జిగా ఒకరే ఉన్నారు. 34 మంది సుప్రీం జడ్జిల్లో ఒకే సామాజిక వర్గం వారు 20 మంది ఉన్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.