NEWSNATIONAL

22న దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళ‌న

Share it with your family & friends

ఏక‌గ్రీవంగా ఏఐసీసీ తీర్మానం

న్యూఢిల్లీ – ఏఐసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దేశ వ్యాప్తంగా ఆగ‌స్టు 22న ఆందోళ‌న చేప‌ట్టాల‌ని తీర్మానం చేసింది. మంగ‌ళ‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏఐసీసీ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు కేసీ వేణు గోపాల్, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పీసీసీ చీఫ్ లు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ లు , ఇత‌ర బాధ్యులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌ధానంగా కీల‌క చ‌ర్చ తాజాగా చోటు చేసుకున్న‌, దేశ వ్యాప్తంగా సంచ‌లనంగా మారిన హిడెన్ బ‌ర్గ్ నివేదిక‌పై జ‌రిగింది. సెబీ చైర్మ‌న్ , భ‌ర్త‌, అదానీ కంపెనీల‌లో పెట్టుబ‌డులు ఎలా పెట్టార‌నే దానిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసింది ఏఐసీసీ.

వెంట‌నే స‌మగ్ర ద‌ర్యాప్తున‌కు కేంద్ర స‌ర్కార్ ఆదేశించాల‌ని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈడీ ఆఫీసులను ముట్ట‌డించాల‌ని పిలుపునిచ్చింది. అదానీ మెగా స్కామ్ పై జేపీసీ విచార‌ణ‌కు డిమాండ్ చేసింది. సెబీ చైర్మ‌న్ వెంట‌నే రాజీనామా చేయాల‌ని కోరారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.