మోడీ..బీజేపీ నియంతృత్వం చెల్లదు
ఆప్ మంత్రి అతిషి సంచలన కామెంట్స్
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషి నిప్పులు చెరిగారు. దేశంలో మోడీ నియంతృత్వం..బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ ఆధిపత్యం చెల్లదని అన్నారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆప్ ను ఢిల్లీలో లేకుండా చేయాలని కుట్రలు పన్నారని, కానీ మోడీ, అమిత్ షా ప్లాన్ వర్కవుట్ కాలేదన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా 17 నెలల పాటు మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను జైలులో ఉంచారని, చివరకు కోర్టు విచారణ సమయంలో ఆశ్చర్య పోయే అంశాలు వెల్లడించిందని, ఇకనైనా ప్రభుత్వం మానుకుంటే మంచిదని అన్నారు అతిషి.
అయినా ఇప్పటికీ ఇంకా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ సర్కార్ ప్రయత్నం చేస్తూనే ఉందని ఆరోపించారు. కానీ తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు మంత్రి. బీజేపీకి ధన , కండ బలం ఉందని కానీ ఆప్ కు ప్రజా బలం ఉందని మరిచి పోవద్దన్నారు. తమ నాయకులు, కార్యకర్తలు దేనికీ తల వంచరని అన్నారు. వారు నిత్యం ప్రజల మధ్యనే ఉంటారని ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.
ఆప్ పార్టీ చీఫ్ , సీఎం కేజ్రీవాల్ తో పాటు మంత్రులు, నాయకులపై తప్పుడు కేసులు మోపారని, జైలుకు పంపారని కానీ ఒక్క పైసా కూడా రికవరీ చేయలేక పోయారని ఆరోపించారు అతిషి.