NEWSNATIONAL

రాజ్ దీప్ స‌ర్దేశాయ్ కు కోర్టు షాక్

Share it with your family & friends

ఇల్మీ వీడియోను తీసి వేయండి

ఢిల్లీ – ఇండియా టుడే గ్రూప్ కు చెందిన ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు బిగ్ షాక్ త‌గిలింది. త‌న‌ను కావాల‌ని డ్యామేజ్ చేశారంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు షాజియా ఇల్మీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అంతే కాదు త‌నకు తెలియ‌కుండా, త‌న అనుమ‌తి లేకుండా త‌న అంద‌మైన శ‌రీరానికి సంబంధించిన భాగాల‌పై ఛాన‌ల్ కెమెరా మెన్ ఫోక‌స్ పెట్టాడ‌ని వాపోయింది. దీనికంత‌టికీ కార‌ణం రాజ్ దీప్ స‌ర్దేశాయ్ అంటూ మండిప‌డింది.

ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా న‌ష్టం క‌లిగింద‌ని ఆవేద‌న చెందింది. ఆ మేర‌కు ఢిల్లీలోని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. మంగ‌ళ‌వారం షాజియా ఇల్మీ దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం కేసుపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు.

ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. వెంట‌నే షాజియా ఇల్మీకి వ్య‌తిరేకంగా ఉన్న వీడియోను తీసి వేయాల‌ని రాజ్ దీప్ సర్దేశాయ్ ను ఆదేశించింది. రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ప్రశ్నార్థకమైన ఫుటేజీని రికార్డ్ చేయడానికి లేదా ఉపయోగించుకునే అధికారం లేదని కోర్టు న్యాయ‌మూర్తి మ‌న్మీత్ ప్రీత‌మ్ సింగ్ అరోరా తీర్పు చెప్పారు.