శాస్త్రవేత్తల ప్రయత్నం ప్రశంసనీయం
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్
శ్రీహరి కోట – ఈ దేశం గర్వించ దగిన ప్రభుత్వ సంస్థలలో శ్రీహరి కోట లోని ఇస్రో ఒకటి అని కొనియాడారు ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్బంగా ఇస్రోను సందర్శించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఇస్రో అపూర్వ ప్రయాణం వెనుక ఎందరో శాస్త్రవేత్తల కృషి దాగి ఉందని అన్నారు. గ్లోబల్ స్పేస్ ఎకానీలోనూ భారత దేశం అద్భుతమైన ముద్ర వేసిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలకు పెద్దపీట వేసిందని, ఈ మేరకు భారీ ఎత్తున నిధులను సమకూరుస్తోందని చెప్పారు డిప్యూటీ సీఎం.
ఇస్రో ఎన్నో విజయాలను సాధించిందని, ఇదే సమయంలో కొన్ని ఆశించిన మేర సక్సెస్ కాలేదని అన్నారు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫెయిల్యూర్ లోనూ శాస్త్ర వేత్తలను ప్రోత్సహించిన తీరు అద్భుతమని అన్నారు. ఇలాంటి వ్యక్తి ప్రధానిగా దేశానికి ఉండడం మనందరి అదృష్టమన్నారు పవన్ కళ్యాణ్.