NEWSTELANGANA

మెరిట్ అభ్య‌ర్థుల‌కు న్యాయం చేయాలి

Share it with your family & friends

గురుకుల పోస్టుల‌పై కేటీఆర్ డిమాండ్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌తో ఆట‌లాడు కుంటోంద‌ని ఆరోపించారు. గురుకులాల‌లో పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ఇప్ప‌టికే జాబితాలో మెరిట్ లిస్టులో ఉన్న నిరుద్యోగ అభ్య‌ర్థులు కేటీఆర్ ను హైద‌రాబాద్ లో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు. విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు.

తాను ప్ర‌భుత్వంతో అవ‌స‌ర‌మైతే పోరాడుతాన‌ని కేటీఆర్ హామీ ఇచ్చారు. గురుకుల పోస్టుల భర్తీని తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్ప‌టి దాకా గురుకుల బోర్డు చేపట్టిన నియమాకాలలో 9024 పోస్టులలో డిసెన్డింగ్ ఆర్డర్ పాటించక పోవడం వ‌ల్ల కొంద‌రికి ఒకటి కంటే ఎక్కువ జాబ్స్ వ‌చ్చాయ‌న్నారు. దీని వ‌ల్ల చాలా పోస్టులు మిగిలి పోయాన‌ని పేర్కొన్నారు కేటీఆర్.

గురుకుల పోస్టులలో భర్తీ కాకుండా మిగిలి పోయిన‌ పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థుల్లో భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. జీవో ఎంఎస్ నెంబర్ 81ను సవాల్ చేస్తూ ఐదు మభ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా కాంగ్రెస్ స‌ర్కార్ ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు మాజీ మంత్రి.