మైనార్టీల రక్షణ కోసం హెల్ప్ లైన్
ప్రకటించిన ఆపద్దరమ్మ బంగ్లా సర్కార్
బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ లో దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో పరిస్థితి ఇంకా సద్దు మణగలేదు. తాత్కాలిక ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ కొలువు తీరారు. దేశంలో ఉన్న మైనార్టీలుగా ఉన్న హిందువులు, క్రిష్టియన్లపై దాడులు పెరిగి పోయాయి. అంతే కాకుండా ఇస్కాన్ , ఇతర దేవాలయాలను ధ్వంసం చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీంతో రంగంలోకి దిగారు మహమ్మద్ యూనస్.
ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మత పరమైన మైనారిటీలపై దాడులను నివేదించడానికి హాట్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా షేక్ హసీనాను తొలగించిన తర్వాత మైనారిటీలపై ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
మత పరమైన వ్యవహారాల సలహాదారు ఏఎఫ్ఎం ఖలీద్ హుస్సేన్ ప్రభుత్వం నష్టాల జాబితాను రూపొందిస్తున్నట్లు ధృవీకరించారు. ధాకేశ్వరి జాతీయ ఆలయాన్ని సందర్శించి హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఆగస్టు 5న హసీనా పతనం తర్వాత, 52 జిల్లాల్లో మైనారిటీ వర్గాలపై 200కు పైగా దాడులు జరిగాయి. యూనస్ ఐక్యత, సహనాన్ని కోరారు, హింస బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.