NEWSANDHRA PRADESH

పంధ్రాగ‌స్టు ప్ర‌త్యేకం గ‌వ‌ర్న‌ర్ సందేశం

Share it with your family & friends

78వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా

అమరావ‌తి – ఆగ‌స్టు 15న స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఎస్. అబ్దుల్ న‌జీర్ ప్ర‌త్యేక సందేశం ఇచ్చారు. గురువారం నాడు పంధ్రాగ‌స్టు కార్య‌క్ర‌మం దేశ వ్యాప్తంగా క‌న్నుల పండువ‌గా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే దేశ మంత‌టా ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి.

దేశానికి స్వేచ్ఛ ల‌భించి 78 ఏళ్ల‌వుతోంది. స‌రిగ్గా ఇదే రోజున దేశం స్వేచ్ఛా వాయువుల‌ను పీల్చుకుంది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని గ‌వ‌ర్న‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్రేద‌శ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇవాళ మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ప్రణంగా పెట్టి, అహర్నిశలు పోరాడిన స్వాతంత్ర్య సమర యోధులందరిని స్మరించికునే దినం. వారి త్యాగనిరతే ఈ రోజు మనం స్వాతంత్ర్య స్వేచ్చా ఫలాలను అనుభవించడానికి మార్గం సుగమం చేసింది.

ఇది సత్యం, అహింస, శాంతి, ఐకమత్యం, సర్వ మానవ సౌభ్రాతృత్వంతో విలసిల్లుతూ, ఉత్తేజంగా దేశ ప్రజలంతా పునరంకితం కావలసిన రోజు.

2047 సంవత్సరంలో మన దేశ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరిగే నాటికి, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా, వికసిత్ భారత్ స్ఫూర్తితో అడుగులు వేస్తూ, దేశ నిర్మాణానికి మనందరం పునరంకితం అవుతామని ప్రతిజ్ఞ చేద్దామ‌ని పిలుపునిచ్చారు గ‌వ‌ర్న‌ర్ ఎస్. అబ్దుల్ న‌జీర్.