NEWSTELANGANA

కాంగ్రెస్ స‌ర్కార్ అప్పుల్లో రికార్డ్ – కేటీఆర్

Share it with your family & friends

ఎనిమిది నెల‌ల్లో రూ. 50,000 కోట్ల అప్పులు

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు.

ఈ ఎనిమిది నెల‌ల కాలంలో ఏకంగా రూ. 50,000 కోట్ల అప్పులు చేసింద‌ని మండిప‌డ్డారు. ఎవ‌రి కోసం, ఎందు కోసం తీసుకు వ‌చ్చారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. పాల‌న గాడి త‌ప్పింద‌ని పేర్కొన్నారు. ఏడాది లోపు 2 ల‌క్ష‌ల జాబ్స్ భ‌ర్తీ చేస్తామ‌న్నార‌ని క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కు 10 వేల పోస్టులు కూఢా భ‌ర్తీ చేయ‌లేక పోయార‌ని మండిప‌డ్డారు కేటీఆర్.

ఇంత భారీ ఎత్తున అప్పులు ఎందుకు తీసుకు వ‌చ్చార‌నే దానిపై ప్ర‌భుత్వం శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కోరారు. నిరుద్యోగ భృతి ఏమైంద‌ని నిల‌దీశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు బోసి పోతున్నాయ‌ని, నిధులు మంజూరు చేయ‌క పోవ‌డంతో ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని తెలిపారు.

అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచి పోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయ‌ని వాపోయారు.

పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించక పోవడంతో అప్పుల ఊబిలో కూరుకు పోయిన తాజా మాజీ సర్పంచ్ ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు.