అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షాక్
బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. బుధవారం ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది ధర్మాసనం.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం కుంభ కోణం కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను ఇవ్వడం కుదరని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం చట్ట విరుద్ధం కాదని, న్యాయ బద్ధమైన ఆధారాలు లేవని తీర్పునిచ్చింది.
ఢిల్లీ స్కాంకు సంబంధించి సాక్ష్యాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆధారాలను సమర్పించిందని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది ఈ సందర్బంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆప్ సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట ఇచ్చింది కోర్టు. ఆయనను 17 నెలల జైలు జీవితం నుంచి విముక్తి కల్పించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కొన్ని కండీషన్స్ తో.
ఇదే సమయంలో కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా బెయిల్ వస్తుందని అనుకున్నారు. కానీ షాక్ తగిలింది సీఎం కేజ్రీవాల్ కు.