హైకమాండ్ నిర్ణయమే ఫైనల్
తేల్చి చెప్పిన కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ పరంగా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. ఎవరు గీత దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏఐసీసీ కీలక సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించారు. ఎస్సీ , ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనిపై ఎవరు పడితే వారు కామెంట్స్ చేయకూడదని నర్మ గర్భంగా చెప్పారు.
ఇదే అంశానికి సంబంధించి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఇవ్వ వచ్చని సమాచారం. ఆయన త్వరలోనే ఢిల్లీ టూర్ కు వెళ్లనున్నారు. ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఈ నెలాఖరు లోగా ఇంకా భర్తీ కాకుండా మిగిలి పోయిన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేసినట్లు సమాచారం. మొత్తంగా హైకమాండ్ తన దారి ఏమిటనే దానిపై స్పష్టం చేయనుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.