NEWSNATIONAL

బీజేపీ బైక్ ర్యాలీకి హైకోర్టు లైన్ క్లియ‌ర్

Share it with your family & friends

స‌ర్కార్ పై విజ‌య‌మ‌న్న అన్నామ‌లై

త‌మిళ‌నాడు – త‌మిళ‌నాడు రాష్ట్ర హైకోర్టు కీల‌క తీర్పు చెప్పింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆగ‌స్టు 15 స్వాతంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని బైక్ ర్యాలీ నిర్వ‌హంచాల‌ని త‌ల‌పెట్టింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది ప్ర‌స్తుత డీఎంకే ప్ర‌భుత్వం.

ఈ మేర‌కు బీజేపీ చీఫ్ కె. అన్నామ‌లైకి అనుమ‌తి ఇచ్చేందుకు నిరాక‌రించింది. దీనిని స‌వాల్ చేస్తూ హైకోర్టును ఆశ్ర‌యించారు . దీనిపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు . బుధ‌వారం నాడు కోర్టులో వాదోప వాద‌న‌లు చోటు చేసుకున్నాయి.

కేసును విచారించిన అనంత‌రం న్యాయమూర్తి జి. జ‌య చంద్ర‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికీ జాతీయ ప‌తాకాన్ని ఎగుర వేసే హ‌క్కు ఉంద‌ని పేర్కొన్నారు. జాతీయ జెండా అన్న‌ది ఒక పార్టీకో లేదా కొంద‌రి వ్య‌క్తుల కోస‌మో కాద‌ని స్ప‌ష్టం చేశారు.

జాతీయ ప‌తాకం 143 కోట్ల భార‌తీయుల ఆత్మ గౌర‌వానికి, దేశానికి, జాతికి ప్ర‌తీక‌, ఆత్మ గౌర‌వాన్ని నిల‌బెడుతుంద‌ని తెలుసు కోవాల‌ని సూచించారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌తి ఏటా జాతీయ జెండాల‌తో బైక్ ర్యాలీ నిర్వ‌హించేందుకు ప‌ర్మిష‌న్ ఎందుకు తీసుకోవాల‌ని ప్ర‌శ్నించారు జ‌స్టిస్ జ‌య చంద్ర‌న్.