NEWSANDHRA PRADESH

నారా లోకేష్ ప్ర‌జా ద‌ర్బార్

Share it with your family & friends

బాధితుల‌కు మంత్రి భ‌రోసా

అమ‌రావ‌తి – ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బుధ‌వారం ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. ఇవాల్టితో ఆయ‌న చేపట్టిన ఈ కార్య‌క్ర‌మం 26వ రోజుకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా నారా లోకేష్ ను క‌లిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బాధితులు త‌ర‌లి వ‌చ్చారు. వారంద‌రి నుంచి తానే స్వ‌యంగా విన‌తి ప‌త్రాలు స్వీక‌రించారు. వారికి భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు.

ప్ర‌త్యేకించి “ప్రజాదర్బార్” కు వచ్చే విన్నపాలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు నారా లోకేష్‌. ఉండవల్లిలోని త‌న నివాసంలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ద‌ర్బార్ కు ఇవాళ ఊహించ‌ని రీతిలో బాధితులు క్యూ క‌ట్టారు. త‌మ గోడు వెళ్ల బోసుకున్నారు.

భూ ఆక్రమణ సమస్యలపై బాధితుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో సంబంధిత శాఖతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు నారా లోకేష్. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “హర్ ఘర్ తిరంగా” 3.0 కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి పంపిన లేఖను, జాతీయ జెండాను మంగళగిరి సబ్ డివిజన్ పోస్టాఫీస్ అసిస్టెంట్ సూపరిండెంట్ ఆర్.రాధాకృష్ణమూర్తి మంత్రికి అంద‌జేశారు.