సీనియర్ ఐపీఎస్ లకు షాక్ డీజీపీ ఝలక్
సంతకాలు చేయక పోతే చర్యలు తప్పవు
అమరావతి – ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన వచ్చాక లా అండ్ ఆర్డర్ ను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జగన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు ఐపీఎస్ లకు స్థాన చలనం కలిగింది. అందులో ప్రధానంగా సీనియర్ ఐపీఎస్ లకు ఇప్పటి వరకు ఎలాంటి డ్యూటీలు కేటాయించ లేదు.
వారందరినీ డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించింది ఏపీ కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా సీనియర్ ఐపీఎస్ లు 16 మంది వెయింటింగ్ లో ఉంటూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండని వారికి ఇవాళ డీజీపీ మెమో జారీ చేశారు. ఇది కలకలం రేపింది.
సదరు ఐపీఎస్ లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని స్పష్టం చేశారు. అంతే కాకుండా సంతకాల రిజిష్టర్ లో సంతకాలు కూడా చేయాలని ఆదేశించారు. ఇక మెమోలు అందుకున్న సీనియర్ ఐపీఎస్ లలో పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్ , కాంతి రాణా, కాలి రఘురామి రెడ్డి, అమ్మి రెడ్డి, విశాల్ గున్ని, విజయ రావు, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పాలరాజు, కృష్ణ కాంత్ పటేల్ , జాషువా ఉన్నారు.
దెబ్బకు వీరంతా బిగ్ షాక్ కు లోనయ్యారు డీజీపీ జారీ చేసిన మెమోను చూసి.