నిరసన పేరుతో విధ్వంసం – షేక్ హసీనా
తన రాజీనామా వెనుక పెద్ద కుట్ర జరిగింది
ఘజియాబాద్ – బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా తొలిసారిగా స్పందించారు. బుధవారం ఆమె కీలక ప్రకటన విడుదల చేశారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తను రాజీనామా చేయడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. ప్రధానంగా అమెరికా తనను దించేందుకు ప్రయత్నం చేసిందని నిప్పులు చెరిగారు.
తాను రాజీనామా చేసిన వెంటనే లండన్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని, కానీ అమెరికా ఒత్తిళ్లతో యుకె సర్కార్ తల వంచిందని వాపోయారు. అయినా తన చిరకాల మిత్ర దేశం భారత ప్రభుత్వం తనకు అన్ని రకాలుగా అండదండలు అందించిందని, ప్రధాని మోడీకి, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా కు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు షేక్ హసీనా.
అయితే తన దేశం నుంచి తనకు న్యాయం జరగాలని తాను కోరుతున్నానని పేర్కొంది మాజీ ప్రధాన మంత్రి. రాడికల్స్ ను టెర్రర్ యాక్ట్స్ అని తొలిసారిగా పదం ఉపయోగించింది. విద్యార్థుల ఆందోళన వెనుక కొన్ని దేశ వ్యతిరేక శక్తులు పని చేశాయని ఆరోపించారు షేక్ హసీనా.