NEWSINTERNATIONAL

కోర్టు బిగ్ షాక్ ప్ర‌ధాని తొల‌గింపు

Share it with your family & friends

రాజ్యాంగాన్ని ఉల్లంఘించార‌ని తీర్పు

థాయ్ లాండ్ – థాయ్ లాండ్ దేశంలో అనిశ్చితి చోటు చేసుకుంది. దేశంలోని అత్యున్న‌త న్యాయ స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించార‌ని సీరియ‌స్ అయ్యింది ధ‌ర్మాస‌నం. ఈ మేర‌కు థాయ్ లాండ్ ప్ర‌ధాన మంత్రి స్రెట్టా థావిసిన్ ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించింది. అత‌ను ఒక్క నిమిషం కూడా ప్ర‌ధానిగా ఉండేందుకు అర్హుడు కాడంటూ పేర్కొంది.

ఎవ‌రైనా స‌రే దేశానికి సంబంధించి రాజ్యాంగానికి కట్టుబ‌డి ఉండాల్సిందేనంటూ పేర్కొంది ధ‌ర్మాస‌నం. ఈ సంచ‌ల‌న తీర్పుతో ఒక్క‌సారిగా ప్ర‌ధాని షాక్ కు గుర‌య్యారు. నోట మాట రాలేదు ఆయ‌న‌కు. దీంతో ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి నుంచి స్ట్రెట్టా థావిసిన్ ను తొల‌గించారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా బంగ్లాదేశ్ దేశంలో కూడా అనిశ్చిత వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. షేక్ హ‌సీనా ఆందోళ‌న‌కారుల నిర‌స‌న‌తో దిగి వ‌చ్చారు. బ‌ల‌వంతంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం ఆమె భార‌త దేశంలో ఆశ్ర‌యం పొందారు.

ఇదిలా ఉండ‌గా థాయ్ లాండ్ లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అత్య‌ధిక సీట్లు గెలుచుకుంది ఎంఎఫ్పీ పార్టీ. దీనిని కూడా అక్క‌డి కోర్టు ర‌ద్దు చేసింది. ప్ర‌స్తుతం థాయ్ లాండ్ లో ఉత్కంఠ నెల‌కొంది.