మువ్వొన్నెల జెండా ఆత్మ గౌరవ పతాక
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – 78వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సందేశం ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బుధవారం సీఎం జాతీయ జెండా ఔన్నత్యాన్ని వెల్లడించారు.
మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యమని అన్నారు ఏపీ సీఎం. మోదీ మూడో సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని జరుపు కుంటున్నామని తెలిపారు. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయమని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు.
మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య చౌదరి రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరడం మనకు మరింత ప్రత్యేకం, గర్వకారణమని అన్నారు. ప్రతి ఇంటి పై, ప్రతి కార్యాలయం పై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెప లాడేలా ఎగుర వేయాలని కోరారు ఏపీ సీఎం.
అలాగే జాతీయ జెండాను మీ సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయి. స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం.