ప్రపంచం తోనే తెలంగాణ పోటీ – సీఎం
పక్క రాష్ట్రాలతో కాదన్న ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక నుండి తెలంగాణ రాష్ట్రం పోటీ పడేది పక్క రాష్ట్రాలతో కాదు, ప్రపంచం తోనేనని చెప్పారు. అన్ని రకాల అనుకూలమైన పరిస్థితులు హైదరాబాదులో ఉన్నాయని అన్నారు సీఎం.
తెలంగాణకు పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోటీ అనుకోవడం లేదన్నారు. తన ఫోకస్ అంతా మన రాష్ట్రం యావత్ ప్రపంచంతో పోటీ పడేలా ముందుకు సాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యువతీ యువకుల పాత్ర గొప్పదన్నారు. వారిని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.
ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా భవిష్యత్తు అంతా యువత పైనే ఆధారపడి ఉంటుందన్నారు. అభివృధ్ధికి దోహదపడే ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో, ఎయిర్ పోర్టులాంటి అనేక సౌకర్యాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయని వెల్లడించారు సీఎం.
ప్రపంచంతో పోటీ పడడానికి ఫీచర్ సిటీని నిర్మిస్తాం. అందుకు కావాల్సిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. పెట్టుబడులు పెట్టే వారిని ఆహ్వానిస్తున్నామని అన్నారు సీఎం. మీ పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కాగ్ని జెంట్ కొత్త క్యాంపస్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.